మేడారం జాతర : గద్దెపైకి చేరిన సారలమ్మ

medaram0131తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. భక్త జనకోటి ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సారలమ్మ తల్లి రాకతో, గద్దెలు జనసంద్రంగా మారాయి. బుధవారం(జనవరి-31) సారలమ్మను కన్నెపెల్లి నుంచి డప్పు వాయిద్యాల మధ్య, గిరిజన సంప్రదాయ రీతిలో మేడారానికి తీసుకువచ్చారు పూజారులు. వనదేవత సారలమ్మ కన్నెపేల్లి నుంచి మేడారానికి ఊరేగింపుగా బయల్దేరి వచ్చింది.

ఆదివాసీ సంప్రదాయ నృత్యాల నడుమ పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలిసి సారలమ్మ మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకువచ్చారు. సారలమ్మ రాకకోసం భక్తులు చలిని లెక్కచేయకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. గద్దెల వద్ద బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దర్శనం కోసం రెండు ప్రవేశ మార్గాల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా దర్శనం తర్వాత రెండు మార్గాల ద్వారా భక్తులను బయటకు వదులుతున్నారు. విద్యుత్ దీపాల వెలుగులతో జాతర పరిసరాలు కాంతులీతున్నాయి. గద్దెల వద్ద భక్తుల పూనకాలతో ఆధ్యాత్మిక సందడి వాతావరణం నెలకొంది.

రేపు చిలకలగుట్ట నుంచి గద్దె మీదకు సమ్మక్క

గురువారం (ఫిబ్రవరి-1) చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె మీదకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్  సిబ్బంది చిలకలగుట్ట చుట్టూ టైట్ సెక్యూరిటీ పెట్టారు. వనమూలికలు సంరక్షిస్తున్నామని చెప్పారు. అటు ఫైర్ సేఫ్టీ అధికారుల కూడా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy