మేడారం జాతర సూపర్ సక్సెస్ : కడియం

medaramkadiyamమేడారం జాతర సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు అధికారులు. తెలంగాణ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా అత్యంత భక్తి,శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసినందుకు భక్తులు, అధికారులు, సిబ్బంది ఇలా అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు,పేరునా ధన్యవాదాలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. భక్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతర విజయవంతం చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు దాదాపు …కోటీ 25 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్పారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని..వీఐపీలు వచ్చినా క్యూ లైన్లు ఆపకుండా దర్శనం కల్పించామన్నారు. ఈ జాతరలో ఏర్పాటు చేసిన మ్యూజియం అందరినీ ఆకట్టుకుందన్నారు. జాతర విజయవంతం చేసేందుకు కృషిచేసిన ప్రతొక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.

ప్రభుత్వం పెద్ద ఎత్తునా ఏర్పాట్లు చేసినా.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు తల్లుల మీద ఉన్న భక్తితో భక్తులు సంయమనం పాటించి సహకరించినందుకు భక్త కోటికి కృతజ్ణతలు తెలిపారు. సమ్మక్క-సారక్కల జాతర అంటేనే భక్త జన సంద్రం. అనేక మంది ముఖ్య అతిధులు అమ్మలను దర్శించేందుకు నేరుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని, ప్రభుత్వానికి సహకరించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యులు, ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులు జాతరకు వచ్చి తెలంగాణ ప్రభుత్వ ఆతిధ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy