మేడారం జాతర : స్పెషల్ పోలీస్ మొబైల్ యాప్

APPSజనవరి 31 న ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకి పోలీస్ డిపార్టుమెంటు భక్తుల భద్రత, సౌలభ్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక మొబైల్ ఆప్ ను రూపొందించారు. దీని ద్వారా మేడారం వచ్చే భక్తులకు తెలియవలసిన వివరాలు, ప్రయాణం, సూచనలు వంటి అంశాలు ఉంచారు. మొట్టమొదటి సారిగా అందరికి అర్థం అయ్యే విధంగా ఈ ఆప్ తెలుగు, ఇంగ్లీష్ బాషలలో సమాచారం అందుబాటులో ఉంటుంది.

యాప్ ఫీచర్స్

మేడారం జాతర విశిష్టత, చరిత్ర, జాతర డైలీ కార్యక్రమాలు.తేదీలు, రోజువారీ కార్యక్రమాల వివరాలతో పాటు, జాతర జరిగే 4 రోజులలో ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులకు వేర్వేరు రోడ్ల వివరాలను ఈ యాప్ లో చూడొచ్చు.

తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి స్వంత లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చేవారు ఏ ఏ మార్గాల ద్వారా రావచ్చు, ఎక్కడి నుండి ఎంత దూరం ఎక్కడెక్కడ దారి మల్లింపులు ఉంటాయి, ఏ రోడ్ల ద్వారా వచ్చే వారికీ ఏ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి,  పాటించవలసిన సూచనలను, మ్యాప్ లు,  ప్రత్యక్ష గూగుల్ మ్యాప్ ద్వారా మేడారం చేరుకోవడానికి దారి సూచనలతో పాటుగా ఉంచారు.

మేడారం చుట్టుప్రక్కల ఉన్న 30కి పైగా పార్కింగ్ స్థలాలను భూ ఉపరితల అనుసంధానం చేసి జియో ట్యాగ్గింగ్ ఆప్ వాడే వారు తమ ఉన్న స్థలం నుండి అక్కడికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకునే విధంగా సూచనలను అందించడం, పార్కింగ్ సామర్థ్యం, పార్కింగ్ స్థలం విస్తీర్ణత, ప్రస్తుత పార్కింగ్ యొక్క లభ్యత స్థితి వంటి అంశాలు, ఆ పార్కింగ్ స్థలం నుండి అమ్మవారి గద్దెలకు సుమారు దూరం, పార్కింగ్ స్థలాల నుండి ఆర్టీసీ  ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సదుపాయం నుండి సుమారు దూరం వంటి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

ఆర్టీసీ బస్సులు, రైలు మార్గాల ద్వారా వచ్చే వారికోసం తగిన సమాచారం ఉంది. భక్తులు ముఖ్యంగా తెలుసుకోవలసిన జాతర ప్రదేశాలైన జంపన్న వాగు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం, అమ్మవారి గద్దెల దర్శనం క్యూ లైన్లు వివరాలు ఉన్నాయి.

తప్పి పోయే వారి సహాయార్థం ఈ సారి ప్రత్యేకంగా సహాయ, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి సహాయ కేంద్రాల వివరాలు, అదే విధంగా ఎవరైనా తమ వారు తప్పి పోయినా లేదా తప్పి  పోయినవారు కనిపించినా, ఈ ఆప్ ద్వారా ఫోటో మరియు వారి ప్రదేశం వివరాలతో సమాచారం అందించవచ్చు.

ఇవే కాకుండా భక్తులు ఏవైనా ఇబ్బందులు లేదా సంఘటనలు ఎదురైతే వాటిని కూడా పోలీసువారికి ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతర ప్రాముఖ్యత మరియు రద్దీ దృష్యా పౌరులు ఎటువంటి జాగ్రత్తలు ట్రాఫిక్ పరంగా, మరియు భద్రత పరంగా తీసుకోవాలి, సూచనలు, పాటించవలసిన నియమాలు సవివరంగా ఇవ్వబడినాయి.

ఒక్కసారి ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత  ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చూడగలిగేలా ఈ ఆప్ ను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy