మేడారానికి హెలీకాప్టర్.. టికెట్ ధర ఎంతంటే

AIRమేడారం జాతరకు వెళ్లేవారి కోసం ఈ సారి హెలీకాప్టర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం 30 నిమిషాల్లో హన్మకొండ నుంచి మేడారం చేరుకునే అవకాశం ఏర్పడింది. తుంబి ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్ధ హెలీకాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హెలీకాప్టర్‌ సేవలు బుధవారం నుంచి ప్రారంభం కా నున్నాయి. ఇద్దరు పైలట్లు సహ ఆరుగురు ప్రయాణించగల సా మర్థ్యం ఉన్న రెండు హెలీకాప్టర్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెలీకాప్టర్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి.

ఆర్ట్స్‌ కాలేజీ నుంచి….

ప్రయాణికులు హన్మకొండ నుంచి నేరుగా మేడారం జాతర కు వెళ్ళేందుకు సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ వద్దకు రావలసి ఉంటుంది. హన్మకొండ నుంచి మేడారం జాతరకు వె ళ్లి తిరిగి రావడానికి ఒక్కో ప్రయాణికుడు రూ.13,999 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం జాతరకు వెళ్ళడానికి లేదా తిరిగి జాతర నుంచి రావడానికి ఒక్కో ప్రయాణికుడికి రూ. 6,999గా ధర నిర్ణయించారు. హెలికాప్టర్‌లో ప్రయాణించిన భక్తులను మేడారంలోని పగిడాపూర్‌ హెలిప్యాడ్‌ నుంచి గద్దెల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయిస్తారు. ప్రతి ట్రిప్పుకు ఐదు నుంచి ఆరుగురు ప్యాసింజర్లు ప్రయాణం చేసే వెసులు బాటును కలిపించారు. హెలీకాప్టర్‌ సుమారు 30 నిమిషాల్లో జాతరకు చేరుకుంటుంది. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3వరకు హెలీకాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గాన వాహనాల్లో వెళ్లితే 2గంటలకు పైగా సమయం పడుతుంది.

విహంగ వీక్షణం…

జాతర ప్రాంతంలో హెలీకాప్టర్‌లో విహరించాలంటే రూ. 2,599 చెల్లిస్తే చాలు. జాతరలో 8 నిమిషాల పాటు ఆకాశయా నం చేస్తూ జాతర పరిసరాలను తిలకిస్తూ మధురానుభూతి పొందవచ్చు. విమానయానం కోసం మరిన్ని వివరాలు, టికెట్‌ బుకింగ్‌ కోసం 86298-93491 అనే నెంబర్‌లో సంప్రదించవచ్చు. మేరాఈవెంట్స్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy