మేడిపల్లి ఫైర్ యాక్సిడెంట్ : హెల్మెటే అతడి ప్రాణాలని కాపాడింది..

Helmet (1)హెల్మట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా వినరు. అయితే ఇప్పడు హెల్మటే ఓ వ్యక్తి ప్రాణాలని కాపాడింది. శుక్రవారం (జనవరి-12) మధ్యాహ్నం మేడిపల్లి సమీపంలోని చంగిచర్ల దగ్గర ట్యాంకర్ కు మంటలు అంటుకుంటున్నాయి. పెద్ద శబ్ధంతో ట్యాంకర్ పేలిపోయింది. ఆయిల్ ఎగసిపడింది. ఆయిల్ తోపాటు మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై కూడా ఆయిల్ పడింది. వాహనాలు తగలబడిపోయాయి. ఐదు బైక్స్ నడిరోడ్డుపై తగలబడిపోయాయి. ముగ్గురి వ్యక్తులకు శరీరం కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి శరీరం మొత్తం కాలిపోయింది. అయితే తలకి హెల్మెట్ పెట్టుకోవడంవల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా వచ్చిన మంటలు తలకితగిలివుంటే చనిపోయే అవకాశం ఉండేదని చెప్పారు డాక్టర్లు. ఈ ప్రమాంలో ఓ వ్యక్తి మరణించాడు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సో ఇప్పటికైనా టూవీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోండి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy