‘మేడ మీద అబ్బాయి’ టీజర్ రిలీజ్

meda-midaaతన కామెడీతో ‘కితకితలు’ పెట్టే అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాలని భావిస్తున్నప్పటికి ఈ హీరో సినిమాలు అంతగా జనాదరణ పొందడం లేదు. తాజాగా ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ‘మేడ మీద అబ్బాయి’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుండగా ,తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో డైలాగ్స్ తో పాటు సినిమాటోగ్రఫీ మూవీపై అంచనాలను పెంచుతుంది. ఇక చివరిలో రామ్ గోపాల్ వర్మ ఈ టీజర్ పై ఏం కామెంట్ పెడతాడో అని అల్లరి నరేష్తో అనిపించడం విశేషం. ఈ చిత్రం నరేష్ కెరీర్ లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy