మేమున్నాం : తప్పు చేయనివారికి ‘మా’ అండ

maa-press

తెలుగు సినీ పరిశ్రమ సిల్వర్ జూబ్లీ సమయంలో ఇలా డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం బాధాకరమన్నారు ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా. ఈ వ్యవహారంలో అమాయకులను బలి పశువులను చేయడం కరెక్ట్ కాదన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుల పేర్లు రావడంతో ఆందోళనకు గురవుతోంది పరిశ్రమ. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్ల పేర్లు.. చేయని వాళ్ల పేర్లు రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. వాళ్ల కుటుంబాలకు కెరీర్ కు సంబంధించిన విషయం.. మా బిడ్డలుగా మా బాధ్యతగా చూసుకుంటామన్నారు. ఇకపై ఇలాంటివి జరగవు అని చెప్పారు. తప్పు చేసినవారు దోషే.. అంతమాత్రానా అందరూ తప్పు చేసినట్టు కాదని.. అందరినీ అనుమానించొద్దని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కోరుతోందన్నారు. విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. అధికారికంగా చెప్పే వరకు ఆర్టిస్టులపై ఆరోపణలు తగవన్నారు శివాజీరాజా.

మా కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. సినీ నటుల పేర్ల విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. నోటీసులు వచ్చినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదన్నారు. విచారణకు పిలవడం వేరు, నేరం చేయడం వేరన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఇది కొందరు వ్యక్తుల సమస్య. ఇండస్ట్రీ సమస్య కాదన్నారు. తాము మనుషులమే… తమకు కుటుంబాలు ఉన్నాయన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇండస్ట్రీ సిద్ధంగా ఉంది. కేవలం ఒక్క చిత్ర పరిశ్రమను ఫోకస్‌ చేయడం సరికాదన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy