మేము భారతీయులం కాదా..?

badaun-gangarapeఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ ఎంపీకి ఇబ్బంధికరమైన ప్రశ్న ఎదురైంది. రాష్ట్రంలోని బదాన్ జిల్లాలోని కత్రా గ్రామాన్ని సందర్శించినపుడు అక్కడ ఒక వ్యక్తి అడిగిన ఈ ప్రశ్నకు ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఈ గ్రామంలో ఇద్దరు దళిత అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. అత్యంత దారుణంగా రేప్ చేసి చెట్టుకు ఉరేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వివిధ పార్టీల నేతలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్ కూడా పరామర్శకు వెళ్లినపుడు తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు తమ బాధను నేతలతో పంచుకున్నారు. అయితే తాము దళితులమని, అందుకే తమపై ఇలాంటి అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని వాపోయారు. తాము భారతీయులం కాదా అని, తమపైనే ఎందుకిన్ని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. దీంతో వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ.. అఖిలేష్ ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీబీఐ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కంప్యూటర్ యుగంలో కూడా కుల వివక్ష కొనసాగడం, ఇలాంటి దారుణాలు జరగడం దారుణమని పౌరసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇక బాధిత కుటుంబాలను వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. శనివారం కాంగ్రెస్ వైస్ ప్రసిడెంట్ రాహుల్ గాంధీ కత్రా గ్రామాన్ని దర్శించారు. బాధిత కుటుంబాన్ని కలుసుకొని ఓదార్చారు. నిందితులను వీలైనంత తొందరగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి కత్రా గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబాల గోడు విన్నారు. నిందితులేను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలను ఆపడంలో అఖిలేశ్ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy