మే నెల.. బీపీ మంత్

Blood pressure measuring.బీపీ చెక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే.. గుండె జబ్బుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఏటా లక్షల్లో గుండె జబ్బులతో చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే… బీపీ చెకింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి ఆరోగ్య సంస్థలు. దీనిలో భాగంగా మే నెలను “మే మెజర్‌మెంట్‌ మంత్” గా ప్రకటించాయి. దేశంలో 25 లక్షల మందికి, ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి బీపీని చెక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలోని ఐసీఎంఆర్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా 100కిపైగా సంస్థలు బీపీ పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో 500కుపైగా నగరాల్లో బీపీ పరిశీలన చేస్తారు. మీరు ఏ ఆస్పత్రికి వెళ్లినా అక్కడ ఉచితంగా.. లేదా నామమాత్రపు రుసుము చెల్లించి బీపీ చెక్‌ చేయించుకోవచ్చు. బీపి సరిగ్గా చూపించుకోకపోవడం.. అధిక రక్తపోటున్నా.. దాన్ని పట్టించుకోకపోవడంతో దేశంలో ఏటా 2 లక్షల మంది హృద్రోగాలు, స్ర్టోక్‌.. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. దీంతో ప్రజల్లో బీపీపై అవగాహన పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఆరోగ్య సంస్థలను బీపీ పరిశీలన నెల కార్యక్రమాన్ని చేపట్టాయి. 120/80 అంతకన్నా కాస్త తక్కువగా ఉంటే.. సాధారణంగా.. 140/90 వరకు హైపర్‌టెన్షన్‌కు ముందు దశగా భావిస్తారు. 140/90 కన్నా అధిక రక్తపోటు ఉంటే.. తప్పనిసరిగా దానిపై నిరంతరం ఓ కన్నేయాలి. తరచూ పరిశీలన చేయించుకోవడం మంచిది. రక్తపోటు పెరగడానికి కారణాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy