మే 28న ప్రిలిమ్స్‌: టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి షెడ్యూల్ విడుద‌ల‌

gurukulగురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.  పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీ , ఫిజికల్ డైరెక్టర్స్(స్కూల్స్) పోస్టులకు మే 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది టీఎస్‌పీఎస్సీ. మిగ‌తా పోస్టుల‌కు మే లేదా జూన్ నెల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.ఈ నెల 18 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు అధికారులు.

ఉపాధ్యాయ పోస్టుల‌కు అర్హ‌త‌లు
టీజీటీ పోస్టులకు అభ్యర్థులు డిగ్రీ (బీఏ, బీఎస్సీ, బీకాం)లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థుల‌కు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు.
డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టుతో బీఎడ్‌ చేసి ఉండాలి. మొదటి నోటిఫి కేషన్‌లో ప్రథమ శ్రేణి/ద్వితీయ శ్రేణిలో బీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనగా.. ఇప్పుడు దానిని తొలగించారు. పీజీటీ పోస్టులకు బోధనా అనుభవం ఉండాలన్న నిబంధనను తొలగించారు.
బీఎడ్‌తోపాటు టెట్‌ (తెలంగాణ టెట్‌/సెంట్రల్‌ టెట్‌/ ఏపీ టెట్‌ పేపర్‌–2)లో అర్హత సాధించి ఉండాలి. ఏపీ టెట్‌ అయితే 2014 జూన్‌ 2వ తేదీకి ముందు అర్హత సాధించినదై ఉండాలి. టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఇక ఇంటగ్రేటెడ్‌ కోర్సుల వారికి అవకాశమిచ్చారు. బీఎడ్‌తోపాటు బీఏబీఈ డీ, బీఎస్సీబీఈడీ వంటి ఇంటిగ్రీటెడ్‌ కోర్సులు చేసిన వారు అర్హులే. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్‌లో పొందవచ్చు.
డీఎడ్‌–డిగ్రీ కలిగిన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు.

పీఈటీ పోస్టులు
616 పీఈటీ పోస్టులకు ఈనెల 20 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సాధారణ అభ్యర్థులు ఇంటర్‌లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు 45% మార్కులు సాధించి ఉండాలి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్‌ /అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా/డిప్లొ మా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. లేదా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌తో బ్యాచిలర్‌ డిగ్రీలో 50% మార్కులు సాధించి ఉండాలి.

మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు
197 మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతితోపాటు డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ మ్యూజిక్‌/ ఇండియన్‌ మ్యూజిక్‌లో డిగ్రీ/ నాలుగేళ్ల డిప్లొమా ఇన్‌ లైట్‌ మ్యూజిక్‌ సర్టిఫికెట్‌ కోర్సు/ ఎంఏ ఫోక్‌ ఆర్ట్స్‌/ మాస్టర్‌ ఆఫ్‌ పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌/ డిగ్రీపాటు కర్ణా టక–హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌లో డిప్లొమా చేసిన వారు అర్హులు.

స్టాఫ్‌ నర్సు పోస్టులు
533 స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఈనెల 20 నుంచి మే 6 వరకు దరఖాస్తులు స్వీకరి స్తారు. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారు అర్హులు. వాటితోపాటు ఏపీ/తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో అభ్యర్థులు రిజి స్టర్‌ చేసుకుని ఉండాలి.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ పోస్టులు
ఆరు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ పోస్టులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ చేసి ఉండాలి. అందులో సాధారణ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగులైతే 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇందులో మరికొన్ని అర్హతలు కలిగిన వారికి అవకాశం కల్పించారు. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

లైబ్రేరియన్‌ పోస్టులు
256 లైబ్రేరియన్‌ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులు
372 ఆర్ట్‌ టీచర్, 43 క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు ఈనెల 20 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్ట్‌ టీచర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా ఇన్‌ ఆర్ట్స్‌/ ఫ్రీహ్యాండ్‌ ఔట్‌లైన్‌ అండ్‌ మోడల్‌ డ్రాయింగ్‌/ డిజైన్‌ అండ్‌ పెయింటింగ్‌ కోర్సు చేసి ఉండాలి. వాటితోపాటు హయ్యర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి. క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వుడ్‌ వర్క్‌/ టైలరింగ్‌/ బుక్‌బైండింగ్‌/ ఎంబ్రాయిడరీ/ కార్పెంటర్‌/స్యూయింగ్‌ టెక్నాలజీ/ డ్రెస్‌ మేకింగ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. హయ్యర్‌ గ్రేడ్‌ టీటీసీ చేసి ఉండాలి.

ఫీజుల వివరాలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థి రూ.200 చెల్లించాలి. పరీక్ష ఫీజు మరో రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy