మైక్ చూస్తే పూనకమొస్తుంది : ఈ సారి సివిల్ సర్వెంట్లపై నోరు జారిన త్రిపుర సీఎం

mikeత్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ జోరుగా వార్తలకెక్కుతున్నారు. స్టేజ్ ఎక్కగానే మైక్ ని చూడగానే పూనకమొచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు విప్లవ్ దేవ్. ఆయన మాటలపై ఎంత రచ్చ జరుగుతున్నా పద్దతి మాత్రం మార్చుకోవడం లేదు.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ మరోసారి నోరు జారారు. ఈసారి ఆయన…సివిల్ సర్వెంట్ల మీద పడ్డారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్లు సివిల్ సర్వీసెస్ లోకి రాకూడదన్నారు విప్లవ్ దేవ్. వాళ్లకు సమాజం నిర్మాణంపై అవగాహన ఉండదనేది ఆయన పాయింట్. అదే సివిల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్లైతే బిల్డింగ్ లతో పాటు సమాజాన్ని, పాలనా వ్యవస్థను నిర్మిస్తారన్నారు బిప్లబ్ కుమార్ దేబ్. గతంలో ఆర్ట్స్ గ్రాడ్యుయేట్లు మాత్రమే సివిల్స్ వైపు వెళ్లేవారని, ఇప్పుడు మెడిసిన్, ఇంజినీరింగ్ చదేవేవాళ్లు కూడా సివిల్స్ లో జాయిన్ అవుతున్నారన్నారు.
ఇలా మాట్లాడడం విప్లవ్ దేవ్ కు కొత్తేం కాదు. సీఎం కాకముందు సంగతేంటో కానీ… అయ్యాక మాత్రం ఇది మూడో ఘటన. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్ నెట్ ఉండేదనడం బిప్లబ్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ మెంట్. దాంతో ఊరుకోలేదాయన. మొన్నటికిమొన్న మాజీ మిస్ వరల్డ్ డయానా హేడెన్ ను అవమానించేలా మాట్లాడారు. డయానా హేడెన్ అందగత్తె కాదని… ఆమెకు మిస్ వరల్డ్ కిరీటం గెలిచిందంటే తనకు నవ్వొస్తుందన్నారు. ఐశ్యార్యా రాయ్ మాత్రమే అసలైన భారతీయ అందం అన్నారు విప్లవ్ దేవ్.
మొత్తంగా విప్లవ్ దేవ్ ఏం మాట్లాడినా…నేషన్ వైడ్ టాపిక్ అయిపోతోంది. లోకానికే తెలియని కొత్త కొత్త విషయాలు విప్లవ్ దేవ్ చెబుతుంటే ఆయన స్పీచ్ లకు ఆడియన్స్ జడుసుకుంటున్నారు. కొందరు తల కిందకు వంచుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుండగా ఎందుకొచ్చాంరా దేవుడా అంటూ మరికొందరు తలలు పట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy