మైసూరు సిల్క్ చీరలతో మెరవనున్న ఎయిర్ హోస్టెస్ లు…!

mysoresilk_sareeమైసూరు సిల్క్ చీరలంటే… మహిళలకు అదో మోజు. ఆ చీర కట్టుకుంటే… అందం… హుందాతనం… చెప్పనక్కర్లేదు. అలాంటి మైసూరు సిల్క్ చీరలకు ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు రాబోతుంది. ఎయిర్ ఇండియా లోని ఎయిర్ హోస్టెస్ లు, ఫ్లయిట్ అటెండెన్ట్ లు ఇకపై మైసూరు సిల్క్ చీరలనే ధరించాలని ఆ సంస్థ నిర్ణయించింది. అందుకోసం 10 వేల చీరలు కావాలని ఎయిర్ ఇండియా సంస్థ నుంచి కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు భారీ ఆర్డర్ వచ్చింది. ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన ఆర్డర్ విలువ దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఉంటుంది. దీంతో, సడన్ గా మైసూరు సిల్క్ చీరల ఖ్యాతి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్తుందని కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు చెప్పారు. మైసూరులో తయారయ్యే ఈ చీరలకు బాగా డిమాండ్ ఉంది. మామూలుగా ఒక్కో చీర ధర రూ. 10 నుంచి 12 వేల వరకు ఉంటుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy