
ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 64 లక్షల మంది సంచార జాతులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాయీ బ్రాహ్మణులకు 25 నుంచి 30వేల సెలూన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదవులకు రూ.4వేల కోట్లతో 88వేల గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. డోర్నకల్, మరిపెడ అభివ్రుద్ధి కోసం కోటి చొప్పున.. డోర్నకల్ లోకి పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరంగల్ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా అభివ్రుద్ధి చేసి చూపిస్తానన్నారు సీఎం కేసీఆర్.