మొదటి సారి అసెంబ్లీ వెల్ లో T మినిస్టర్లు: గ్యాలరీ దృశ్యం ..

drnఈ రోజు T మినిస్టర్లు దాదాపు అందరూ శాసన సభ వెల్ లోకి దూసుకు వెళ్లి CM, ఇతర సీమాంధ్ర పక్ష నాయకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాడారు. T బిల్లు వెనక్కి పంపాలన్న సీమాంధ్ర కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణా నాయకత్వం సమిష్టిగా జరిపిన ఈ యుద్ధ దృశ్యం అసెంబ్లీ గ్యాలరీ నుండి మీ కోసం ప్రత్యేకంగా…

ఎవరో ఒకరో ఇద్దరో తప్పితే ఇప్పటికీ సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఇప్పటివరకు తెలంగాణ మంత్రులెవరూ చేయలేదు. కానీ రూల్ 77 పేరుతొ ఆయన చేబట్టిన కొత్త చర్యను నిరసిస్తూ ఈ రోజు టీ మంత్రులంతా వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. క్యాబినెట్ లో మంత్రులయి ఉండి కూడా సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలకు గొంతు కలిపారు. ఇదంతా ఎలా జరిగింది. వీళ్లలో అకస్మాత్తుగా తెలంగాణ పై ప్రేమ పెరిగిందా లేక సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం పుట్టుకొచ్చిందా… ఏం జరిగిందో చూద్దాం…

భారత దేశ చట్టసభల చరిత్రలో క్యాబినెట్ లోని మంత్రులే వెల్ లోకి దూసుకెళ్లడం, పోడియంను చుట్టుముట్టడం ఇప్పటివరకు జరగలేదు. కాని మన అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం తో సహా తెలంగాణ మంత్రులంతా అదే పనిచేశారు.

అందరూ ఊహించినట్లుగానే టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐతో పాటు తెలంగాణా టీడీపీ సభ్యులంతా వెల్ లోకి దూసుకెళ్లారు. అయితే టీ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఊహించని విధంగా అందరికంటే గట్టిగా స్పందించారు.

డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ డైరెక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి  నినానాదాలు చేశారు. అప్పటి వరకు తమ సీట్లోనే నిల్చున్న టీ మంత్రులు కూడా  వాళ్లతో జతకలవాల్సిందే అంటూ దామోదర మంత్రులను స్వయంగా వెల్ లోకి నెట్టేశారు. మొత్తం మంత్రులు, టీ కాంగ్ ఎమ్మెల్యేలను సమాయత్తం చేస్తూ నినాదాలివ్వాల్సిందిగా అందర్నీ కూడా గట్టారు. వెల్ లోకి వెళ్లాలా లేదా అన్న డోలాయామానం లో ఉన్న మంత్రులంతా ఇక మారు మాట్లాడకుండా ఎమ్మెల్యేలతో బాటు ముందుకు దూసుకెళ్లారు. జై తెలంగాణ అని నినదించడానికే మనసొప్పని మంత్రి దానం నాగేందర్ ను కూడా దామోదర రాజనర్సింహ వెల్ లోకి పంపి నినాదాలిప్పించారు. అంతెందుకు ఇప్పటివరకు తెలంగాణ నేతలతో కలవడానికే ఇష్టపడని ఎమ్మెల్యే జయసుధ ను కూడా స్పీకర్ పోడియం దగ్గరకు పంపించారాయన.

జై తెలంగాణ నినాదాలతో పాటు కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కు వ్యతిరేకంగా  డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే కొందరు మంత్రులు కూడా ఆ నినాదాలు చేయడంతో సభలో ఉన్న సీమాంధ్ర సభ్యులు ఆశ్చర్యపోయారు.

అలా మొత్తానికి  ఎప్పుడూ తెరవెనుక మాత్రమే మాట్లాడే డిప్యూటీ సీఎం ఇవాళ సభలో టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందు నిలిచి చరిత్రలో ఎప్పుడూ జరగని సన్నివేశాన్ని సృష్టించారు.

సంగప్ప జేనవాడే

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy