మొదట రభస.. ఆ తర్వాత కూల్

loksabha_1612లోక్ సభ బుధవారం కాస్త రభస.. మరికొంత చర్చ అన్నట్టుగా సాగింది. మొదట్లో విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు  కొనసాగించారు స్పీకర్ సుమిత్రా మహాజన్. తర్వాత నిర్భయ ఘటన, మహిళా రక్షణపై సభలో చర్చ జరిగింది. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఎంపీలు. చాలా సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయన్నారు. నిర్భయ నిందితులను కఠినంగా శిక్షించాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఇక.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం పెంపుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంపు వివరాలను సభకు తెలిపారు. పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై రూపాయికి పైగా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్రం. కమర్షియల్ డివిజినల్ కోర్ట్స్ బిల్ -2015 పై సభలో డిస్కషన్ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీలు ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు చేశారు. మరికొందరు ఎంపీలు మాత్రం ఇది న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. అయితే.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకే కమర్షియల్ డివిజినల్ కోర్ట్స్ బిల్ తీసుకొచ్చామని చెప్పారు కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడ. మొదట ఆందోళన చేసిన విపక్షాలు.. తర్వాత కూల్ అవ్వడంతో.. సభ సజావుగా నడిచింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy