మొన్న యాదన్న.. ఇవాళ రాజన్న

rajannaదక్షిణ కాశి వేముల వాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ అభివృద్ధిపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. 3 వందల కోట్లతో ఆలయాన్ని డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్స్ సర్కార్ రెడీ చేసింది. అభివృద్ధి పనులపై  జరగనున్న సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ముందుగా.. సీఎం కుటుంబ సమేతంగా.. వేములవాడ రాజన్న దర్శనం చేసుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి వారి దర్శనం తర్వాత.. వేముల వాడ ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. వేములవాడకు ఏటా భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీంతో సౌకర్యాలు సరిపోక.. భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 300 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. 15 కోట్లతో రెండో ప్రాకార నిర్మాణం, 15 కోట్లతో కల్యాణ వేదికలు,10కోట్లతో ధర్మగుండం ఆధునీకరణ, 50 కోట్లతో గుడిచెరువు సుందరీకరణ, 30కోట్లతో వసతి గదులు.. 20కోట్లతో ఆధ్యాత్మికత ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణకు 80 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు లెక్కలు గట్టారు. వీటన్నింటిపై సీఎం కు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

వేములవాడ రాజన్న దర్శనం కోసం…నిన్న రాత్రే కేసీఆర్ కరీంనగర్ వచ్చారు.   తీగల గుట్టపల్లిలోని తన ఇంట్లో బస చేశారు. స్థానిక టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జిల్లా అధికారులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం టూరు కోసం వేములవాడలో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వేములవాడకు వస్తున్న కేసీఆర్ కు..గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy