మొన్న 200, నిన్న 20 మంది కిడ్నాప్..!

bokoharam-kidnapబొకోహరమ్ మిలిటెంట్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మాయిలను, మహిళలను కిడ్నాప్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా కలకలం సృష్టిస్తున్నారు. మొన్న 200 మంది స్కూల్ గాల్స్ ను కిడ్నాప్ చేసిన ఇన్సిడెంట్ మరువక ముందే.. లేటెస్ట్ గా మరో 20 మంది మహిళలను ఎత్తుకెళ్లారు బొకోహరమ్ మిలిటెంట్స్. గురువారం నైజీరియాలోని బోర్నో స్టేట్ నుంచి 20 మంది మహిళలను బొకోహరమ్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. అయితే బొకోహరమ్ వరుసగా కిడ్నాప్ లకు పాల్పడుతున్నా ఆర్మీ ఫైయిల్ అవుతుండటంపై విమర్శలు మొదలయ్యాయి. స్టేట్ లో ఎమర్జెన్సీ విధించినా.. ఆర్మీ మాత్రం కనిపించడం లేదని.. దీంతో కిడ్నాపర్స్ రెచ్చిపొతున్నారని లోకల్ రెసిడెంట్స్ చెబుతున్నారు.

ఎవరీ బొకో హరమ్..?

bokoharamబొకో హరమ్ అనే పదం 2002 లో వెలుగులోకొచ్చింది. నైజీరియాలో వెస్టర్న ఎడ్యుకేషన్ కు నిరసనగా ఈ బొకోహరమ్ సంస్థ పుట్టుకొచ్చింది. నైజీరియాలో ఇస్లాం స్టేట్ ఏర్పాటు చేయాలని 2009 నుండి మిలిటరీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. నార్త్-ఈస్టర్న్ నైజీరియాలో ఈ మిలిటెంట్స్ జరిపిన దాడిలో వేల మంది చనిపోయారు. అంతే కాకుండా క్యాపిటల్ సిటీ అభుజా లో ఐక్యరాజ్య సమితి హెడ్ కోర్టర్స్ తో పాటు.. పోలీసులపై కూడా అటాక్ చేశారు. వీళ్లు చేస్తున్న క్రూర చర్యలకు గానూ.. బొకోహారమ్ ను 2013లో టెర్రరిస్ట్ గ్రూప్ గా  ప్రకటించారు. బొకోహారమ్ లీడర్ అబుబకార్ షెకావ్ ఆధ్వర్యంలో ఈ గ్యాంగ్ దాడులు, కిడ్నాప్ లు చేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy