మొబైల్‌లోనే ఈ-వాహన బీమా రిజిస్టర్‌

KTRఇండియాలోనే  మొదటిసారిగా రాష్ట్రంలో వెహికిల్స్ కు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో బీమా సౌకర్యం కల్పించే వెసులుబాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు ఐటీశాఖ మంత్రి కెటీఆర్. ‘ఈ-వాహన బీమా’ సౌకర్యాన్ని మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. వాహనాలకు బీమా సౌకర్యం లేకపోవటంతో ప్రమాదం జరిగినపుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే ఈ-వాహన బీమాను రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఐటీశాఖ, రవాణ, పోలీస్‌ కలిసి నిర్వహిస్తున్న ఈ పథకానికి ఐఆర్‌డీఏఐ సహకారం అందించిందన్నారు. వీటితో పాటు ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అమలు చేస్తే బాగుంటుందని కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy