మొబైల్ ఇంటర్నెట్ రేట్లు డబుల్ చేసిన వొడాఫోన్..

vodophone.internetవొడాఫోన్ మొబైల్ ఇంటర్నెట్ యూజర్స్ కి బ్యాడ్ న్యూస్. మొబైల్ ఇంటర్నెట్ ను డబుల్ చేస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంట్రీ వైడ్ గా 2జీ, 3జీ మొబైల్ ఇంటర్నెట్ రేట్లను డబుల్ చేసేసింది. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్ల ఇద్దరికీ ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఇప్పటి వరకు 10kb లకు 2 పైసలు ఛార్జ్ చేసేవారు. పెంచిన రేట్లతో 10 కేబీకి 4 పైసలు వసూలు చేస్తారు. లాస్ట్ ఇయర్ కంపెనీ 80 శాతం రేట్లను తగ్గించింది. అంటే 10 కేబీకి 10 పైసలు పడుతున్న ఛార్జిని 10 కేబీకి 2 పైసలకు తగ్గించింది. తాజాగా ఇప్పుడున్న రేట్లను డబుల్ చేసింది. ఈ రేట్లను డబుల్ చేయడం వల్ల కస్టమర్లపై అంతగా భారం ఉండదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న రేట్లను డబుల్ చిసినా.. కంపెనీ ఎన్నో ఆఫర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని కంపెనీ స్పోక్స్ పర్సన్ తెలిపారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy