మొబైల్ బిజినెస్ లోకి శిల్పాశెట్టి

M_Id_437563_shilpashetty-viaan-rajబాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రంగంలోకి ఎంటరివ్వనున్నారు. తమ కొడుకు వియాన్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయనున్నారు. ఐపీఎల్ రాజస్థాన్ పార్టనర్స్ అయిన ఈ జంట బీఎస్‌ఈ, కోల్‌కతా స్టాక్ ఎక్సేంజీ ద్వారా తమ కంపెనీ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించారు. నవంబర్ 25న మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అదేవిధంగా వియాన్ పేరుతో వియాన్ మొబైల్, వి-ట్యాబ్, వి-పవర్, వి-టీవి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. యూఏఈ, యూరోప్, అమెరికాలతో పాటు కామన్‌వెల్త్ దేశాల్లో వియాన్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy