మొహాలీ వన్డే : టీమిండియా బిగ్ విక్టరీ

indమొహాలీ వేధికగా బుధవారం (డిసెంబర్-13)న శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులతో బిగ్ స్కోర్ చేసింది. 393 పరుగుల బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. 8 వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 251 పరుగులు చేసి, ఓటమి పాలైంది. భారత కెప్టెన్ రోహీత్ శర్మ డబుల్ సెంచరీతో తిరుగులేని విజయాన్ని అందించాడు. ఫస్ట్ వన్డేలో ఓడిపోయిన కసిని తీర్చుకున్న భారత ప్లేయర్లు లంక ప్లేయర్లపై విరుచుకు పడ్డారు. భారత బౌలర్లలో చౌహాల్(3), బుమ్రా(2), భువీ(1), పాండ్యా(1), వాషింగ్ టన్ సుందర్(1) వికెట్లు దక్కించుకున్నారు.

లంక ప్లేయర్లలో మ్యాథ్యూస్ (111) సెంచరీతో రాణించినా ఫలితంలేకుండా పోయింది. భారీ లక్ష్య ఛేదనలో 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కీలక ఆటగాడు ఉపుల్ తరంగా(7) పరుగలకే పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం మరో ఓపెనర్ గుణతిలకా(16) పరుగులు చేసి వెనుదిరిగాడు. స్వల్ప స్కోర్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ లంక జట్టును సీనియర్ ఆటగాడు మాథ్యూస్, తిరుమనేతో కలిసి ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అయితే 21 పరుగలకే తిరుమనే ఓ వైపు ఇతర ఆటగాళ్లు ఔట్ అవుతున్న మ్యాథ్యూస్ మాత్రం నిలకడగా ఆడుతూ.. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నించాడు. ఒక దశలో వికెట్ కీపర్ డిక్‌వెలా మైదానంలో మెరుపులు మెరిపించినా… 22 పరుగులకే ఔట్ అయ్యాడు. చాహాల్ వేసిన 31వ ఓవర్‌లో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్‌లో రెండో బంతిని ముందుకు వచ్చిన భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గణరత్నే(34) స్టంప్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌‌కు వచ్చిన లంక జట్టు కెప్టెన్ పెరీరా(5) ఆదే ఓవర్‌లో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో మూడు వన్డెల్లో భాగంగా శ్రీలంక, భారత్1-1తో సమంగా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy