మోగ్లీ గర్ల్..మా పాపనే

71492745283_Unknownఉత్తర్ ప్రదేశ్ లోని ఓ అడవిలో కోతులతో పాటు జీవిస్తూ పోలీసులకు కన్పించిన ఎహాస్ అలియాస్ ‘మోగ్లీ గర్ల్’ తమ బిడ్డేనంటూ ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. అసలు పేరు లక్ష్మీ అని 2012లో ఆమె తప్పిపోయిందని చెబుతున్నారు. ఈ మేరకు 2012 నవంబర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని ఆధారంగా చూపారు.

తమకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి లక్ష్మీని  అప్పగించాలని కోరుతున్నారు. రోటిన్ పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు అడవిలో కోతులతో ఆడుకుంటూ ఓ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమెను కాపాడి స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని జంట చూపుతున్న ఫిర్యాదు పత్రాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy