మోడీకి ‘అమరావతి’ ఆహ్వానమందింది

chandrakkljhok_images_news_sep15_13_thumb_medium300_225స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ను..ప్రధాని మోడీకి ఇచ్చింది సబ్ కమిటీ. ఉపసంఘానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. నివేదికను మోడీకి అందజేశారు. అమరావతి శంకుస్థాపనకు రావాలని ప్రధాని నరేంద్రమోడీతో పాటు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు బాబు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ పాల్గొన్నారు. ప్రధాని మోడీని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు చంద్రబాబు. రిపోర్ట్ లో కాలుష్య నియంత్రణ, స్వచ్ఛ భారత్ లో విద్యార్థులను ఇన్వాల్వ్ చేయడం.. పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు చంద్రబాబును కలిశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ పై డిస్కస్ చేశారు. కేజ్రీవాల్ ను కూడా అమరావతి శంకుస్థాపకు ఇన్వైట్ చేశారు బాబు. తర్వాత కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు చంద్రబాబు. రాజధాని శంకుస్థాపన రావాలని కోరారు. రెవెన్యూ లోటు పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ఆర్థిక సహాయం చేయాలని కోరిన బాబు,.. ప్రత్యేక హోదాపై డిస్కస్ చేశారు. తర్వాత చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, ఎల్ కే అద్వానీ, సీపీఐ నేత బర్దన్ ను కలిసి అమరావతి శంకుస్థాపనకు ఇన్వైట్ చేశారు. కేంద్ర హోంశాఖమంత్రి రాజ్ నాథ్ ను కలిసిన బాబు.. విభజన చట్టంలో  పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు. 9, 10 షెడ్యూల్ పై డిస్కస్ చేశారు బాబు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy