మోడీకి నేను అనుకూలమే..

modi-mamataనిన్నటి వరకు ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఒక్కసారిగా స్వరం మార్చారు. తనకు మోడీతో విభేదాలు లేవని.. వచ్చిన చిక్కల్లా బీజేపీ, అమిత్‌ షాలతోనే అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్‌ షా జోక్యం ఏంటని విమర్శించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు తెలిపారు. దేశానికి ప్రధాని మోడీనా, అమిత్‌ షానా అని ప్రశ్నించారు. తాను మోడీకి అనుకూలమని.. అమిత్‌ షాకు కాదన్నారు. ప్రధానమంత్రిని విమర్శించాలనుకోవడం లేదన్నారు. అమిత్ షా సూపర్‌ డిక్టేటర్‌షిప్ చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు మాజీ ప్రధాని వాజపేయిపై ప్రశంసలు కురిపించారు. బీజేపీకి చెందిన నాయకుడైనప్పటికీ ఆయన నిష్పక్షపాతంగా, సమదృష్టితో పనిచేశారని కితాబిచ్చారు. ఆయనతో కలిసి పనిచేనినప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని అన్నారు మమత. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్ని ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికి ఎటువంటి కూటమి ఏర్పడలేదని, ఇప్పుడే పని మొదలు పెట్టామని.. ఆరు నెలలు ఆగాలని మమతా బెనర్జీ అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy