మోడీ ఎఫెక్ట్ : పాప పేరు కూడా…GST

gst-babyపాప..బాబు ఎవరికైనా ఆ తల్లిదండ్రులు తమ పెద్దవాళ్ల పేర్లు లేదంటే ఇష్టదైవాల పేర్లు పెడుతారు. కానీ ఈ పేరెంట్స్ వినూత్నంగా పేరు పెట్టారు. ఏం పేరు అనుకుంటున్నారా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన GST నే. జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్, మోడీలు కలిసి GST ని లాంచ్ చేశారు. ఈ పేరునే ఓ తల్లి తన పాపకి పెట్టుకుంది. GST అమల్లోకి వచ్చిన రోజునే పాప జన్మించడంతో.. అందుకు గుర్తుగా తల్లి తన బిడ్డకు GST  అని పేరు పెట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్ లో  చోటు చేసుకుంది.

బీవర్‌ ఆస్పత్రిలో ఓ మహిళ అర్ధరాత్రి (జులై 1) 12.02 నిమిషాలకు పాపకి జన్మనిచ్చింది. అదే సమయంలో GST అమలు కావడంతో…మోడీ ప్రభుత్వం ఉన్న మక్కువతో పాపకు GST అని పేరు పెట్టుకుంది ఆ తల్లి. GST ని ఎత్తుకొని ఆ తల్లి ఫొటోలు దిగుతూ తెగ మురిసిపోయింది. ఈ పేరుపై రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే ట్వీట్ చేశారు. GST (చిన్నారి) కలకాలం జీవించాలనిజ.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy