మోడీ ఏంచేసినా తప్పేనా?.. ప్రతిపక్షాలపై జైట్లీ ఆగ్రహం

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కార్ చేసే ప్రతి పనినీ కావాలని తప్పుపట్టే ఓ వర్గం తయారైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. మోడీ సర్కార్ ఏం చేసినా వ్యతిరేకించడానికే ఈ వర్గం అలవాటు పడిందని మండిపడ్డారు. అమెరికాలో కేన్సర్ కు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న జైట్లీ…. తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఇలాంటివారు చేస్తున్న ఆరోపణలకు ఎన్ని సార్లు వివరణలు ఇస్తున్నా వారి ధోరణిలో మార్పు రావడం లేదు’ అని ఆయన బ్లాగ్ లో చెప్పారు.

ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ ఐడియాలజీతో ఉన్న వారికి.. కేంద్రం అమలుచేస్తున్న అన్ని పథకాల్లో తప్పులే కనిపిస్తున్నాయని అన్నారు జైట్లీ. అనేక సామాజిక అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని ఈ వర్గం పట్టించుకోవడం లేదని చెప్పారు. మోడీ సర్కార్ ను విమర్శించడమే ఆయన వ్యతిరేకులు లక్ష్యంగా పెట్టుకున్నారనీ… అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్రం ముందుకువస్తే ఆ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారని మండిపడ్డారు. ఇలాంటి వారు దేశ సమగ్రతను దెబ్బతీసేవారికి మద్దతు ఇస్తున్నారన్నారు.

జస్టిస్ బీహెచ్ లోయా గుండె పోటుతో చనిపోతే, ఆయన చావుకు కుట్ర జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు జైట్లీ. రాఫెల్ డీల్ ను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారని రాహుల్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. అలాగే సీబీఐ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నాలు జరిగాయన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ఈ కొత్తవర్గం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని అరుణ్ జైట్లీ విమర్శించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy