మోడీ కంచుకోట నుంచే రేపు సోనియా సమరభేరి

soniaకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు వారణాశి నుంచి యూపీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. వారణాశి ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ వ్యూహం ప్రకారం యూపీ ఎన్నికల్లో టార్గెట్ కేవలం బీజేపీయే. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లను పూర్తిగా వదిలేసి బీజేపీ మీదే కాన్ సన్ ట్రేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పూర్తిగా తాను గెలవకపోయినా బీజేపీని నిలువరించి ఓడించగలిగితే తరువాత ఢిల్లీ పీఠం తమదేనన్నది కాంగ్రెస్ అంచనా.

2014 ఎన్నికల్లో మోడీ ఇదే వారణాశిలో రోడ్ షో నిర్వహించారు.. అదే రీతిన సోనియా కూడా రోడ్ షో నే ఎంచుకుని ఇచ్చిన వాగ్దానాలను ఎలా మోడీ గంగలో తొక్కిందీ ఎండగట్టనున్నారు. ఒకటొకటిగా రాష్ట్రాలను కోల్పోతూ జాతీయ స్థాయిలో తన ఉనికే ప్రశ్నార్థకమవుతున్న దశలో మళ్ళీ పూర్వవైభవం సాధించాలని, అది యూపీనుంచే మొదలుకావాలని కాంగ్రెస్ అభిలషిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy