మోడీ గొప్ప వక్త..మాటలు కడుపు నింపవు : సోనియా

SONIA COMMENT MODIకర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ఎల్లుండి సాయంత్రం ప్రచారం ముగియనుంది. మొదటిసారిగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రచార బరిలోకి దిగారు. విజయపురలో ఆమె ప్రచారం చేశారు. ఇక మోడీ, అమిత్ షాలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. 2019లో ప్రధాని అవుతానని తొలిసారి మనసులో మాట బయటపెట్టారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ కర్ణాటక పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు UPA చైర్ పర్సన్ సోనియాగాంధీ. విజయపుర జిల్లాలోని బీజాపూర్ లో సోనియా ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మోడీని సీఎం సిద్ధరామయ్య కలవాలనుకుంటే అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనన్నారామె. మోడీ గొప్ప వక్త అన్న సోనియా… ఆయన మాటలు దేశంలో ఎవరి కడుపు నింపబోవన్నారు.

అంతకుముందు మోడీ కూడా విజయపుర జిల్లాలోనే ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కొప్పాల్ లోనూ ప్రచారం చేశారు. కన్నడ రైతుల ఘోష కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడంలేదని ఆరోపించారు మోడీ. పంటకు అయ్యే ఖర్చుపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇచ్చేలా …కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. తిప్తూర్, బెంగళూరుల్లో ప్రచారం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అవినీతి కేసులో జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ఘనత బీజేపీదేనన్నారు. కర్ణాటకలో గెలవబోతున్నామన్న రాహుల్… 2019లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే… తాను ప్రధాని అవుతానన్నారు.

2019 ఎన్నికల్లో మోడీని ఓడించడం… కాంగ్రెస్ వల్ల కాదని… ప్రాంతీయ పార్టీలతోనే మోడీని ఓడించడం సాధ్యమన్నారు MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. బెళగావిలో JDSకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఒవైసీ. BJP జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మంగళూరు, మడికెరీలలో రోడ్ షోలలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలు కూడా కోస్టల్ కర్ణాటకలో ప్రచారం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy