మోడీ చెప్పినా మారలేదు : బీఫ్ తరలిస్తున్నాడని కొట్టి చంపారు

cowగో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపితే ఊరుకునేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెచ్చరించని కొద్ది గంటలకే జార్ఖండ్ లో మరో హత్య జరిగింది. బీఫ్‌ తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. అతడి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. జార్ఘండ్ రాష్ట్రం రామ్‌గఢ్‌ జిల్లాలోని బజర్తంద్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అలీముద్దిన్‌ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అలీముద్దిన్‌ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ అతడి కారుకు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దిన్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.  ఓ ప్లాన్ ప్రకారమే అలీముద్దిన్‌ హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ గురువారం (జూన్29) గుజరాత్‌ పర్యటనలో స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. మోడీ చెప్పిన కొద్ది గంటలకే ఈ ఘటన జరగడం దారుణం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy