మోడీ టూర్ టార్గెట్ గా జమ్మూలో కాల్పులు

Pakistan_Armyప్రధాని మోడీ టార్గెట్ గా జమ్మూలో టెర్రరిస్ట్ లు చెలరేగిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈరోజు జమ్మూలో పర్యటించనున్నాడు. మోడీ పర్యటించే ప్రాంతానికి కొద్ది దూరంలో టెర్రరిస్ట్ లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులను భద్రతా దళాలు దీటుగా ఎదుర్కొన్నాయి. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గురువారం జమ్మూలో ఆర్మీ శిబిరంపై టెర్రరిస్ట్ లు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు- టెర్రరిస్ట్ లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు టెర్రరిస్ట్ లు, ముగ్గురు సైనికులు మరణించారు. దీంతో మోడీ టూర్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy