మోడీ పకోడి ఐడియా.. లక్షలు సంపాదిస్తున్న కాంగ్రెస్ కార్యకర్త

pakodaప్రధాని సలహా పాటించి కోటీశ్వరుడయ్యాడు ఓ కాంగ్రెస్ కార్యకర్త. రోజుకి నాలుగు గంటలు మాత్రమే కష్టపడి కోట్లు సంపాదించాడు. రోజులో నాలుగు గంటలు ఆడుతూ పాడుతూ పనిచేసి నెలకు 9లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. మోడీ ఇచ్చిన ఆ అద్భుతమైన సలహా పాటించింది మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన వ్యక్తే. అంతేకాదు అతడు కాంగ్రెస్ పార్టీ అనుబంధ స్టూడెంట్ వింగ్ లో సభ్యుడు కూడా. ఇంతకీ ప్రధాని ఇచ్చిన సలహా ఏంటనుకుంటున్నారా?

కొన్ని నెలల క్రితం నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రదాని మోడీ, ఇతర బీజేపీ నాయకులు ఖాళీగా ఉండటం కంటే పకోడీ అమ్ముకోవడం మేలని, పకోడి అమ్ముకున్నా లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై దేశవ్యాప్తంగా నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. అనేక ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకించింది. అయితే పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తిచేసి ఎన్ని ఉద్యోగాలకు అప్లయి చేసినా జాబ్ రాక నిరుద్యోగిగా మారిన వడోదరకి చెందిన నారాయణ్ భాయ్.. ప్రధానమంత్రే చెప్పాడంటే ఇందులో ఏదో కిటుకు ఉందనుకున్నాడు.

ప్రధాని సలహా పాటించి కోటీశ్వరుడవ్వాలని భావించాడు. వెంటనే వడోదరలో పకోడీ స్టాల్ ను ప్రారంభించాడు. దానికి శ్రీరామ్ దాల్ వడ సెంటర్ అని పేరు పెట్టాడు. షాపు ప్రారంభించిన రెండునెలల్లోనే నారామణ్ భాయ్ షాపు పకోడా టేస్ట్ గురించి సీటీ అంతా చర్చ మొదలైంది. పకోడీ తినాలంటే శ్రీరామ్ దాల్ వడ సెంటర్ కే వెళ్లాలి అని సిటీ ప్రజలు అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ రోజుకీ 300 కిలోల చొప్పున నెలకు 9 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అసలు పకోడీ అమ్మి కోట్లు సంపాదించవచ్చా అని నారాయణ్ భాయ్ స్టోరీ చదివిన వాళ్లందరూ ఆశ్యర్యపోతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy