మోడీ పిచ్చి తుగ్లక్.. కట్టబొమ్మన్ గా రెచ్చిపోయిన ఎంపీ శివప్రసాద్

విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలంటూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్… వీరపాండ్య కట్టబొమ్మన్ గెటప్ లో నిరసన తెలిపారు. కట్టబొమ్మన్ వేషంలో… తనదైన శైలిలో డైలాగులు చెబుతూ… ప్రధానిపై విమర్శలు చేశారు.

“మిస్టర్ మోడీ ప్రధానమంత్రివా.. ప్రజా వంచకుడివా… వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యుడివి నీవు. స్నేహం విలువ తెలియదు. ఆపన్నహస్తం ఇచ్చిన చంద్రబాబును హోదా అని, ప్యాకేజీ అని మాటలు మార్చి.. మార్చి.. మోసం చేశావు. రాజధానికి నిధులివ్వమంటే… నీళ్లు ముఖాన కొట్టి వెళ్లావు. వైజాగ్ రైల్వే జోన్ ఎవడబ్బ సొత్తు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటించకపోవడం నీ అహంకారానికి గుర్తు. పిచ్చి తుగ్లక్ లాగా అర్ధరాత్రి చలామణీలో ఉన్న నగదును రద్దు చేశావ్. డబ్బులుండీ .. డ్రా చేసుకోలేక ఏటీఎంల దగ్గర నిలబడి ఎంతమంది చచ్చిపోయారో నీకు తెలియదా. ఎన్ని వివాహాలు ఆగిపోయాయో … ఆ పాపం నీకు చుట్టుకోదా. నల్లధనం తెస్తానని.. ప్రతి అకౌంట్ లో రూ.15లక్షలు వేస్తానన్న నీ ప్రగల్బాలు ఏమయ్యాయి. ముస్లింలంటే నీకు గౌరవం లేదు. రైతులంటే మర్యాద లేదు. గిట్టుబాటు ధరకోసం వచ్చిన రైతులను వాటర్ క్యానన్లతో కొట్టి తరిమేశావ్. ఈడీ వేసిన సంకెళ్లు మమ్మల్ని ఏమీ చేయలేవ్. ఈ సంకెళ్లే 2019లో నిన్ను ఓడిస్తాయ్” అని ఆవేశంతో ఊగిపోయారు ఎంపీ శివప్రసాద్.

ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తున్న మోడీ.. బ్రిటీష్ వారికి ఏమాత్రం తగ్గకుండా నియంతృత్వ పాలన అందిస్తున్నారని విమర్శించారు శివప్రసాద్. మోడీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని.. ప్రజల కష్టాలు ఆయన పట్టడం లేదని అన్నారు. రాత్రికి రాత్రే జనం దగ్గరున్న డబ్బును రద్దు చేసిన మోడీకి.. ఏపీ కష్టాలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను మోడీ అమలుచేయలేదని… ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు శివప్రసాద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy