మోడీ ఉపవాసాలకు ఇబ్బంది కల్గించం : అమెరికా

54451ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే గత నలభై ఏళ్లుగా మోడీ చేస్తున్న దీక్షకు భంగం కల్గుతుందా ? అనే డౌట్ ప్రతి ఒక్కరికీ వచ్చింది. కానీ అమెరికా వైట్ హౌస్ అధికారులు మాత్రం దీక్షకు భంగం కలగదని స్పష్టం చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా మోడీ ఉపవాసం చేయనున్నారు. 40 ఏళ్లుగా నవరాత్రుల్లో  ఆయన ఒక్కపొద్దు ఉంటున్నారు. ఆరు రోజుల అమెరికా టూర్ లో మోడీ నిమ్మరసం, తేనె, టీ మాత్రమే తీసుకుంటారు. ఇక మోడీ ఫాస్టింగ్ కు ఎలాంటి  ఇబ్బందిలేదని వైట్ హౌస్ అధికారులు కూడా చెప్పారు. గెస్ట్ లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని..మోడీ ఉపవాస దీక్ష గురించి తమకు ముందే తెలుసని వైట్ హౌస్ ఆఫీసర్  కైటలిన్ హేడెన్ చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy