మోడీ బడ్జెట్ హైలెట్స్…

360_story_36_635405925350489860కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ఈ రోజు సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టే ముందు జరిగిన  కేబినేట్ మీటింగ్ లో బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దేశ వ్యాప్తంగ పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు జైట్లీ.  గ్రామాల్లో పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరాలకు మించి నిధులు కేటాయించలేమని… ఈసారి బడ్జెట్ నుంచి ఏమీ ఆశించవద్దని ఆయన కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు..

గ్రామీణ ప్రాంతాల్లో రూ.14389 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ. పట్టణాల్లో ఉండే సౌకర్యాలు గ్రామాల్లోనే కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ తో పాటు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ వస్తువుల తయారీకి ప్రొత్సాహాలతో పాటు ట్రైనింగ్ కల్పించేందుకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఇక మహిళల రక్షణ కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నామని…చెన్నై నగర అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. రూ.4 వేల కోట్లతో లోకాస్ట్ హౌసింగ్ ఏర్పాటు చేస్తామన్నారు జైట్లీ. నగరాల్లో మెట్రో సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రైతుల కోసం ఈ ఏడాదే ‘కిసాన్ ఛానల్’..

రైతుల కోసం ఈ ఏడాదే కిసాన్ ఛానల్ ను స్టార్ట్ చేస్తామన్నారు జైట్లీ. భూమి లేని రైతులకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని నాబార్డు ద్వారా ఇస్తామన్నారు. భూసార పరీక్ష కేంద్రాల కోసం రూ.56 కోట్లు కేటాయిస్తామన్నారు. రైతులకు రూ. 100 కోట్లతో భూ నాణ్యత కార్డులు అందిస్తామన్నారు. సకాలంలో తీసుకున్న రుణాలు చెల్లించిన రైతులకు 3 శాతం రాయితీ కల్పిస్తామన్నారు జైట్లీ.

ట్యాక్స్ పరిమితి పెంచిన జైట్లీ….

కేంద్ర ఆర్ధిక మంత్రి ట్యాక్స్ లిమిట్ పెంచారు. ప్రస్తుతం రూ.2లక్షలు ఉన్న దాన్ని రూ 2.50 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు ఆ లిమిట్ ను 3లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక ట్యాక్స్ కాస్ట్ లో ఎటువంటి మార్పులు లేవని లోక్ సభలో ఆయన ప్రకటించారు.

ఢిల్లీ సమస్యల పరిష్కారానికి భారీ నిధులు..

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజధాని ఢిల్లీకి నిధుల వరద కురిపించారు. ఢిల్లీలో పవర్ కష్టాలు తొలిగేందుకు రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా ఉండేందుకు రూ. 500 కోట్లతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడే ఉందని…దాని కోసం మరో 50 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి సాయం…

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు కేంద్రం సత్వరమే పరిష్కరిస్తుందన్నారు. విభజన చట్టంలో ఉన్న విధంగా రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో నడిచేందుకు సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. వీటితో పాటు రెండు రాష్ట్రాలకు యూనివర్శిటీలను కేటాయించారు. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీ…ఆంధ్రప్రదేశ్ కు అగ్రికల్చర్ యూనివర్శిటీ, ఐఐటీ, ఐఐఎం కేటాయించినట్లు చెప్పారు అరుణ్ జైట్లీ. ఇక ఏపీలో ఎయిమ్స్ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ తరహా ఆసుపత్రులు నిర్మించడమే తమ లక్ష్యమన్నారు.

గంగానది ప్రక్షాళన కోసం రూ.2037 కోట్లు…

గంగానది ప్రక్షాళన కోసం రూ. 2037 కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇక నదుల అనుసంధానం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని…దాని గురించి సర్వే చేయడం కోసం రూ.100 కోట్లు కేటాయించామన్నారు. డిఫెన్స్ రంగంలో 2.29లక్షల కోట్లు కేటాయించామన్నారు. మణిపూర్  రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని దీని కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు.

100 స్మార్ట్ సిటీలకు రూ. 7060 కోట్లు..

దేశ వ్యాప్తంగా రూ.7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం చేపడతామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టులను నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బెంగళూర్- ముంబాయి కారిడార్లు, చెన్నై-విశాఖ కారిడార్లను పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. 37 వేల కోట్లతో నేషనల్ హైవేల నిర్మాణం చేస్తామన్నారు.  దేశ వ్యాప్తంగా 9 ఎయిర్ పోర్టుల్లో ఈ వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు.

పెరగనున్న పొగాకు, పాన్ ధరలు…

ఈ ఏడాది నుంచి టోబాకో, సిగరేట్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల సీఎంలకు సిగరేట్ రేట్లు పెంచాలని లేఖలు రాశారు. దీంతో పాటు పాన్ మసాల ధరలు కూడా పెరగనున్నాయి. గుట్కాతో పాటు వేయి రూపాయల పైన ఉండే చెప్పల్ ధరలు కూడా పెరుగుతాయని జైట్లీ తెలిపారు. టెలికాం ప్రొడక్ట్ లు కూడా పెరుగుతాయన్నారు.

తగ్గనున్న కంప్యూటర్లు, టీవీల ధరలు..

ఈ ఏడాదిలో కంప్యూటర్ మోనిటర్ తో పాటు టీవీల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు ఆయిల్ పై ఎక్సైజ్ పన్ను కూడా తగ్గిస్తామన్నారు. దీంతో పోటు సోప్, సోలార్ పవర్ యూనిట్లు చీప్ కానున్నాయి. స్టీల్ కూడా తగ్గుతోందని జైట్లీ తెలిపారు. ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు కూడా తగ్గుతాయన్నారు. డైమండ్ తో పాటు విలువైన రాళ్ల కాస్ట్ కూడా తగ్గుతోందన్నారు జైట్లీ.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy