మోడీ ముడుపుల చిట్టా విప్పిన రాహుల్

rahul-modi-475కొద్దికాలంగా ప్రధాని మోడీపై దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. ఇప్పుడు ముడుపుల గుట్టు విప్పారు. మోడీ సొంతగడ్డపై డైరెక్ట్ గా దాడిచేశారు. గుజరాత్ సీఎంగా ముడుపులు అందుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్… వివరాలతో సహా ప్రకటించాడు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ముడుపులు ఇచ్చారనే విషయాన్ని బయటపెట్టారు. మోడీకి 6 నెలల్లో 9 సార్లు సహారా కంపెనీ డబ్బులు చెల్లించిందని.. బిర్లా కంపెనీ కూడా ముడుపులు ఇచ్చిందని ఆరోపించారు రాహుల్. ఈ విషయాన్ని ఆయా సంస్థలు తమ రికార్డుల్లో తెలిపాయని అన్నారు. డిసెంబర్ 21న గుజరాత్‌ లోని మెసానాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 నవంబర్ 22న సహారా కంపెనీపై ఐటీ దాడులు జరిగాయని, గత రెండున్నరేళ్లుగా ఆదాయం పన్ను శాఖ వద్దే ఆ రికార్డులు ఉన్నా ఎలాంటి చర్య తీసుకోలేదని రాహుల్ ఆరోపించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఐటీ రికార్డుల ప్రకారం వివరాలు:

… 2013 అక్టోబర్ 30న రూ.2.5 కోట్లు

… నవంబర్ 12న రూ.5 కోట్లు

… నవంబర్ 27న రూ.2.5 కోట్లు

… నవంబర్ 29న రూ.5 కోట్లు

… డిసెంబర్ 6న రూ.5 కోట్లు

… డిసెంబర్ 19న రూ.5 కోట్లు

… 2014 జనవరి 13న రూ.5 కోట్లు.. అదే ఏడాది జనవరి 28న రూ.5 కోట్లు

… ఫిబ్రవరి 22 న రూ.5 కోట్లు

పెద్దోళ్లు లోన్లు ఎగ్గొడితే డీఫాల్టర్లా..

బ్యాంకు లోన్లు తీసుకుని రైతులు, మధ్య తరగతి ప్రజలు కట్టకపోతే జైల్లో పెడతారని, అదే ధనికులు ఈ పని చేస్తే వాళ్లను డిఫాల్టర్లు అంటారని రాహుల్‌ అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తామని మార్కెట్‌‑కు వెళితే వ్యాపారులు చెక్‌‑లు కానీ కార్డులు కానీ తీసుకోవడం లేదని, నగదు ఇవ్వాలని చెబుతున్నారని ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మోదీ చెప్పారని, ఎంతమంది ఖాతాల్లో ఎంత డబ్బు వేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy