మోడీ వార్నింగ్ : గోరక్ష పేరుతో అరాచకాలు చేస్తే తాటతీస్తా

modi cowగోరక్ష, ఆవు భక్తి పేరుతో జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇలాంటి చర్యలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గోవులను కాపాడున్నాం అనే ముసుగులో మనుషులను చంపుతారా అని నిలదీశారు. ఇది సరైనది కాదన్నారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. మన సంప్రదాయానికి ఇది విరుద్ధం అన్నారు. ఏ సమస్యకు అయినా హింస పరిష్కారం కాదని.. మనది అహింసా దేశం అని చెప్పారు. గో రక్షకుల పేరుతో కొందరు దేశంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి సమయంలో ఈ మాటలు చెప్పాల్సి వస్తుందన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఉన్నామన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారని ఆందోళనకారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం వందేళ్ల వేడుకలను ప్రారంభించారు. ఆశ్రమంలో చరఖాతో నూలు వడికారు. శ్రీమద్ రాజ్ చంద్ర 150వ జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్, కాయిన్ విడుదల చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy