మోడీ సడన్ విజిట్.. దోస్తీకి పచ్చజెండా

MODI SHARIF (8)రోజులు మారాయా? రాజకీయం మారిపోయిందా? ‘అమీ తుమీ’ తేల్చుకోవాలనుకునేవాళ్ళు ‘హమ్ తుమ్’ అనుకునే మంచిరోజులొచ్చాయా? షేక్ హాండ్ తో సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయవచ్చునన్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయా? అలాగే కనిపిస్తోంది.

అస్సలు ఊహించని దృశ్యమిది. అయినా సరే, మళ్ళీ మళ్ళీ జరిగితే బాగుండుననిపించేది. లేకపోతే…. భారత ప్రధానమంత్రి సడెన్ గా పాకిస్తాన్ వెళ్తారని ఎప్పుడైనా, ఎవరైనా ఊహించారా? కానీ, ఊహకైనా అందనిది ఈవేళ జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కు ప్రధాని మోడీ ఉదయమే బర్త్ డే విషెస్ చెప్పారు. ఇది రొటీనే. కానీ….ఫోన్ లోనే కాకుండా స్వయంగా లాహోర్ వెళ్ళి హేపీ బర్త్ డే చెప్పడం మామూలు విషయం కాదు.

ఉన్నట్టుండి వెళ్తే సెక్యూరిటీ రిస్క్. అయినా సరే, మోడీ ఆ సాహసం చేశారు.  దీనికి తగ్గట్టుగానే షరీఫ్ కూడా రియాక్టయ్యారు. ఎయిర్ పోర్టుకు వచ్చి గంటకుపైగా వెయిట్ చేశారు. మోడీకి షేక్ హాండ్ ఇవ్వడమే కాకుండా కౌగలించుకుని ఆత్మీయస్వాగతం పలికారు. చాయ్ వాలాను హెలికాప్టర్ లో తన ప్యాలెస్ కు తీసుకెళ్ళి మరీ  టీ పార్టీ ఇచ్చారు ఫరీఫ్.

MODI SHARIF (12)లాహోర్ లో ఉన్న తన సొంత ప్యాలెస్ కు మోడీని తీసుకెళ్ళడం ఆత్మీయతకు అద్దం పట్టడమే. అక్కడ జరుగుతున్న షరీఫ్ మనవరాలి పెళ్ళి వేడుకలో కూడా పాల్గొన్నారు మోడీ. పుట్టినరోజు విషెస్ చెప్పడానికి మోడీ ఫోన్ చేసినప్పుడు….మనవరాలి పెళ్ళికి రమ్మని పిలిచారట షరీఫ్. అలా…. అనుకోకుండా మోడీ ఒక వేడుకకు కూడా హాజరైనట్టయింది. ఇలాంటి శుభకార్యాలే శత్రువుల్ని కూడా కలుపుతాయి.

మోడీ, షరీఫ్ గంటసేపు ఏకాంతంగా ఏం చర్చించారో తెలియదు కానీ, రాబోయే రోజుల్లో మరింత స్నేహపూరక్వకంగా చర్చలు జరపడానికి ఇది తప్పకుండా హెల్పవుతుంది.

పాకిస్తాన్ లో మన పీఎం సడెన్ గా అడుగుపెట్టడంవల్ల ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోనక్కర్లేదు కానీ, రెండుదేశాల మధ్య ఉన్న వైరం కాస్తయినా తగ్గడం ఖాయం. దోస్తీ అనేది మొదలైతే….ముందు ముందు మంచి సంబంధాలు ఏర్పడడానికి కొంతయినా అవకాశం ఉంటుంది.

మొత్తానికి, పాకిస్తాన్ లో అడుగుపెట్టి, మోడీ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. భారత ప్రధాని ఒకరు పాకిస్తాన్ లో కాలు మోపడం 12 ఏళ్ళ తరువాత ఇప్పుడే. అదీ సడెన్ గా వెళ్ళడం కూడా రికార్డే.

MODI SHARIF (10)

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy