మోడీ సమన్యాయం ఇదేనా..?

vh jpegమోడీ సమన్యాయం ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు. రెండు రాష్ట్రాలు సమానమే అని మాట్లాడుతున్న మోడీ పోలవరం ఆర్డినెన్స్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుతో లక్షల మంది గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. ఆదివాసీలకు ఆదుకుంటామన్న వెంకయ్య నాయుడు ముందు వారికి పునరావాసం కల్పించాలని..వారికి ఎక్కడ పునరావాసం ఏర్పాటు చేస్తారో ముందు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

పోలవరం డిజైన్ మార్చకపోతే లక్షల మంది గిరిజనులు అనాథలవుతారని ఆయన అన్నారు. లోక్ సభలో బలం ఉందని ఇష్టమొచ్చినట్లు ఎన్డీఏ వ్యవహరిస్తోందని వీహెచ్ మండిపడ్డారు. చంద్రబాబు, వెంకయ్య చెప్పినట్లుగానే మోడీ నడుచుకుంటున్నారని..భూములు కొల్పోయిన రైతులకు రెండింతల భూములు ఇవ్వాలని వీహెచ్  డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలు తగ్గించకపోతే నక్సలైట్ల సమస్య పెరుగుతోందని…గిరిజనులకు ఆకలి సమస్యలు వస్తాయన్నారు.

పోలవరం ప్రాజెక్టుతో రెండు ప్రాంతాల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతున్నారని..ఇది ఇక్కడితే ఆగదన్నారు వీహెచ్. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలన్నారు. ఒడిశాలో 30 గ్రామాలు, చత్తీస్ గడ్ రాష్ట్రంలో 10 గ్రామాలు ముంపుకు గురవుతాయని వీహెచ్ అన్నారు. మెజారిటీ ఉందని వ్యవహరిస్తే రేపు రాజ్యసభలో తమ సత్తా చూపిస్తామన్నారు.

కాంగ్రెస్ నేతలు గిరిజనుల హక్కుల కోసం పోరాడాలి: వీహెచ్

కాంగ్రెస్ నేతలంతా గిరిజనుల హక్కుల కోసం పోరాడాలన్నారు మాజీ మంత్రి వీహెచ్. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని..పోలవరం బాధితులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. వెంటనే పార్టీ సమావేశం నిర్వహించాలని…పోలవరం సమస్య గురించి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆయన అన్నారు. పెరిగిన ధరల గురించి ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని వారిలో ఉత్సాహం నింపాలన్నారు. వెంకయ్య నాయుడు ఆంధ్రాకు సపోర్ట్ చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు నోరు విప్పరా అని మండిపడ్డారు. పోలవరం గురించి కేంద్రం మరోసారి ఆలోచించాలన్నారు వీహెచ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy