రహస్యం ఉండాల్సిందే..! రాఫెల్ డీల్ పై విచారణ అవసరం లేదన్న సుప్రీం

 ఢిల్లీ : రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాఫెల్  ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కోర్టు తీర్పుతో మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానానికి క్లీన్ చిట్ దక్కినట్టైంది. ఫ్రాన్స్  నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని… వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

రాఫెల్  ఒప్పందంలో అనుమానించదగ్గ విషయాలేమీ లేవని… చీఫ్  జస్టిస్  రంజన్  గొగొయ్  నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరమని.. భారత వైమానిక దళంలోకి 4, 5 జెనరేషన్ యుద్ధ విమానాలను చేర్చాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాలను రహస్యంగా ఉంచాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రాఫెల్  ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

2016 సెప్టెంబర్ లో ఈ ఒప్పందం జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రాలేదని.. కేవలం ఫ్రాన్స్  మాజీ అధ్యక్షుడు హోలన్  కామెంట్స్ చేసిన తర్వాతే దీనిపై వివాదం మొదలైందని కోర్టు చెప్పింది. ఆయన చేసిన వ్యాఖ్యలను న్యాయ విచారణకు స్వీకరించలేమని తెలిపింది. రాఫెల్ ఒప్పందంలో ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని చెప్పే సాక్ష్యాలేమీ లేవని న్యాయస్థానం తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy