
మోతాదుకు మించిన మందులే సునంద పుష్కర్ ప్రాణాలు తీశాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చింది. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కు సునంద పోస్ట్ మార్టమ్ నివేదికను సమర్పించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవటం వల్లే సునంద చనిపోయిందని తెలిపారు. ఆమె తీసుకున్న మందులు విషపూరితంగా మారటంతో ప్రాణాలు కోల్పోయారని నివేదికలో వెల్లడించారు. సునంద శరీరంపై ఉన్న గాయాలు చిన్నవేనని….ప్రాణాంతకం కాదని తేల్చారు డాక్టర్ల. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్టు వివరాలను గోప్యంగా ఉంచారు. శశిథరూర్, సునంద సోదరుడి వాగ్మూలాలతో పాటు పోస్టు మార్టం రిపోర్టును పరిశీలించాక వెల్లడిస్తామంటున్నారు. సునంద చనిపోయిన హోటల్ రూంలో లభించిన అల్ ప్రజోలం ట్యాబ్లేట్ స్ట్రిప్స్ ఆధారంగా ఆమె 27 ట్యాబ్లెట్లు మింగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సునందా పుష్కర్ మృత దేహానికి డాక్టర్ సుధీర్ కె గుప్తాతో పాటు మరో ముగ్గురు డాక్టర్లు పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. డాక్టర్ అలోక్ శర్మ మెజిస్ట్రేట్ కు నివేదికను సమర్పించారు.
లేటెస్ట్ గా ఢిల్లీ పోలీసులు సునంద మరణంలో ఆవిడ భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్ పాత్ర ఏమీ లేదని కూడా తేల్చి చెప్పారు.