మౌనంపై సాహితీవేత్తల ఆగ్రహం

download-11దేశంలో జాతీయ భావాల ముసుగులో కొందరు అరాచకం సృష్టిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సాహితీవేత్తలు, హేతువాదులు. ప్రముఖ హేతువాదుల హత్యలకు పాల్పడతున్నవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. తాజాగా ముంబైలో శివసేన కార్యకర్తలు… ప్రముఖ కాలమిస్ట్ సుధీంద్ర కులకర్ణీపై జరిగిన దాడితో ఈ చర్చ మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది. ఒక పక్కన సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తుండటంతో.. మరోపక్క అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అవార్డులు వెనక్కి ఇచ్చేయడం ఎలా మొదలయ్యింది..? మొదట ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..?

  • ఆగస్టు 30న… బెంగుళూరులోని ప్రముఖ కన్నడ రచయిత కల్బుర్గీని దారుణంగా హత్య చేశారు. ఆయన ఇంటిముందే ఈ హత్య జరిగింది. దీనికి హిందూవాదులే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
  • అంతకు ముందు ఇదే ఏడాది ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే, ఆగస్టులో నరేంద్ర దబోల్కర్ లాంటి హేతువాద ప్రముఖులు కూడా హత్యకు గురయ్యారు.
  • ఈ ముగ్గురిని ఒకే భావజాలంతో ఉన్నవారే హత్య చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో పెరిగిపోతున్న అతివాద భావజాలానికి ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
  • ఇదే సమయంలో దాద్రీ ఘటన మరోసారి ప్రజాస్వామ్యవాదులను కలతకు గురిచేసింది. కల్బుగురి హత్య తర్వాత హిందూ అతివాదుల అఘాయిత్యాలపై నిరసన వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఒక్కో రచయిత తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఈ వరుసలో ప్రముఖంగా నిలిచింది పండిట్ నెహ్రూ మేనకోడలు రచయిత్రి నయనతార సెహగల్.
  • సారా జోసెఫ్ (మలయాళం), రెహ్మాన్ అబ్బాస్ (ఉర్దూ రచయిత), కె. సచ్చిదానందన్ (మలయాళ), అశోక్ వాజ్ పేయ్, పంజాబీ రచయితలు గుర్‌బచన్ భల్లార్, అజ్మీర్ సింగ్ ఔలఖ్, అతంజిత్ సింగ్, అమన్‌సేథ్, గుజరాత్ రచయిత గణేష్ దేవి ఇలా అందరూ తమ అవార్డులను తిరిగి ఇచ్చేశారు.
  • వీరిలో కొందరు తమ సాహిత్య అకాడమీ పదవులను కూడా వదిలేసుకున్నారు.
  • సాక్షాత్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీనిపై మాట్లాడారు. దేశసమగ్రతను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని గుర్తు చేశారు. అప్పటి వరకు ప్రధాని ఒక్క మాట కూడా మట్లాడలేదు. హిందూ, ముస్లీమ్ లు పోరాడాల్సింది పేదరికంపై అంటూ ఒక్క మాట మాట్లాడి మళ్లీ మౌనం బాట పట్టారు.
  •  తాజాగా సుధీంద్ర కులకర్ణీ ఇన్సిడెంట్ మరోసారి దీనిపై దేశవ్యాప్త చర్చకు తెరతీసింది.
  • ఇప్పటికైనా కేంద్రం మౌనం వీడాలంటున్నారు రచయితలు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy