మౌనం వీడిన మౌన ముని..!!

manmohan-singh-speech_650x400_61432710178తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావన్న మాజీ ప్రధాని

పీఎంవో ను స్వార్థానికి వాడుకోలేదని వివరణ

మన్మోహన్ కు అమిత్ షా కౌంటర్ అటాక్

ఎట్టకేలకు మౌన ముని మాజీ ప్రధాని మన్మోహన్ మౌనం వీడారు. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రధానమంత్రి ఆఫీస్ ను తన స్వార్థానికి వాడుకోలేదని.. తన కుటుంబాన్ని, ఫ్రెండ్స్ ను పైకి తీసుకురావడానికి తాను ప్రయత్నించలేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. 2జీ స్కామ్ పై చెప్పింది చేయకుంటే ముప్పు తప్పదని.. అప్పటి ప్రధాని మన్మోహన్ తనను బెదిరించారని ట్రాయ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ బైజల్ మంగళవారం అన్నాడు. ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ – 2జీ పేరుతో బైజర్ రాసిన పుస్తకంలో స్కామ్ కు సంబంధించిన విషయాలు ఉన్నదున్నట్లు రాశానని చెప్పాడు. ఈ విషయాలపై మాజీ ప్రధాని స్పందించారు. అవినీతి పేరుతో మోడీ ప్రభుత్వం ప్రజల దృష్టిని అనవసర విషయాలవైపు మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ హయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం లేదన్నారు. యూపీఏ హయంలో ఆర్థిక అభివృద్ధి లేదన్న ఆరోపణలను మన్మోహన్ తోసిపుచ్చారు. మేక్ ఇన్ ఇండియా.. యూపీఏ స్కీం అయితే.. మన్మోహన్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా. పీఎం పనే అవినీతిని నిరోధించడమని చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy