మ‌లేషియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కబాలి

rajanikanthమ‌లేషియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ర‌జ‌నీకాంత్‌ను ఆ ప్ర‌భుత్వం నియ‌మించ‌నుందా.. అంటే అవున‌నే స‌మాధానం విన‌ప‌డుతోంది. క‌బాలీకి మ‌లేషియాలో అత్య‌ధిక స్థాయిలో అభిమానులున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌లేషియా ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ క‌బాలిని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌మ దేశానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని స్వ‌యంగా న‌జీబ్ ర‌జాక్ కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయ్‌. అయితే ఈ వార్త‌ల‌ను ఖండించారు త‌లైవా. మ‌లేషియాలో మ‌రిన్ని సినిమాలు చేయాల్సిందిగా న‌జీబ్ కోరిన‌ట్లు ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు. మలేషియా ప్రధాని రజనీతో సెల్ఫీ కూడా దిగారు. ఏప్రిల్ 2న స‌మావేశం పై మాట్లాడిన క‌బాలి.. త్వ‌ర‌లోఅభిమానుల కోసం ఫోటో సెష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆ ఏర్పాట్ల‌పై మాట్లాడేందుకే స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు ర‌జ‌నీ కాంత్. మ‌లేషియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy