యజ్ఞం.. భారతీయ సంప్రదాయమిచ్చిన వరం

ayutha chandi yaaga యజ్ఞం.. యాగం.. భేదమేంటి..?

యాగం.. యజ్ఞం.. రెండూ ఒక్కటే. ఇది ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణ కాలం నుంచి రకరకాల యజ్నాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడానికి చేసేదే ఈ మహా యాగం. వేదకాలం నుంచి భారతావనిలో స్వయంగా మహర్షులు, చక్రవర్తులు, మానవుడిగా అవతరించిన పంరంధాముడు… ఈ యాగాన్ని పూర్తి చేశారు. సాధారణంగా యజ్ఞాలు మూడు రకాలు. అవి.. పాక యజ్ఞం, అవిహవిర్యజ్ఞం, సోమ యజ్ఞం.

మన పురాణాల్లో ఎన్నో యాగాలు, హోమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రాజులు చేసేవి. కొన్ని మానవులు చేసేవి. రాజుల రాజ్యం కోసం, లోక కల్యాణార్థం కోసం చేస్తే… మనుషులు నిత్య జీవితంలో అయిదు యజ్ఞాలు చేయొచ్చని యజుర్వేదం చెబుతుంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండడానికి చేసే యజ్ఞాల్లో ఉపయోగించే ద్రవాల వలన… దేవతలు సంతృప్తి చెంది… ప్రకృతి వైపరీత్యాలను నివారించి… సకాలంలో వర్షాలను కురిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గ్రామాలన్నీ పాడిపంటలతో పచ్చగా వర్థిల్లేలా దేవతలు అనుగ్రహిస్తారు.

సమస్త యజ్ఞాలు యజుర్వేదం నుండే ఆవిర్భవించాయి. యజ్ అనే ధాతువుకు దైవపూజ, దానము అని అర్థం. యజ్ఞం ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో.. ఎలాంటిది చేయాలి? అనే కాలజ్ఞానాన్ని యజుర్వేదం నుంచి జ్యోతి శాస్త్రం ఆవిర్భవించింది. యజ్ఞ వేదికపై హోమ గుండాన్ని ఏ రీతిగా…. ఏ పదార్థంతో నిర్మించాలో… అవన్నీ వాస్తు శాస్త్రం వివరిస్తుంది. మంత్రాలను సరైన రీతిలో ఉచ్ఛరింపచేసే నిమిత్తం… వ్యాకరణ శాస్త్రాన్ని కూడా యజుర్వేదమే పుట్టించింది. అందుకే యజ్ఞం అంటే… శక్తివంతమైనదని నమ్ముతారు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా.. తీరుతుందని యాగాన్ని నిర్వహిస్తారు.

సైన్స్ కూడా ఒప్పుకుంది…

మరో పక్క యాగం వల్ల వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్ఛతకు దారి తీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలుండవని కొంతమంది అంటారు. యజ్ఞకర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు.. ఎక్కడ యాగాన్ని పూర్తి చేస్తారో… అక్కడ సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి. ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచూ వినిపించేది. మనిషి శరీరానికి హానిచేసే సూక్ష్మక్రిములయితే…యాగం జరిగిన కొన్ని కిలోమీటర్లు దరి చేరవు. అంతేకాదు హోమాల్లోని భస్మంతో కొన్ని రకాల ఔషదాలను తయారు చేస్తుంటారు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంటల భూముల్లో చల్లితే.. ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని ప్రజలు పీలిస్తే…శరీరం లోపల ఉండే అనారోగ్యాలు తగ్గిపోతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు…లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్లాలని…ఆ విభూతిని తాకాలని పెద్దలు చెబుతుంటారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy