యవ్వనం వికసిస్తుంది : ఇండియా మొక్కలో దాగిన రహస్యం

 యవ్వనాన్ని పొడిగించేందుకు ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్రయోగాలు జరిగాయి. కొందరు సైంటిస్టులు వాటిని ఆహ్వానించారు. మరికొందరు కొట్టి పారేశారు. ఇప్పటిదాకా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యవ్వన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ విటమిన్‌‌‌‌‌‌‌‌-ఏ. దీని వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌లున్నాయి. వాటిని వాడినప్పుడు చర్మం ఎర్రబడుతుంది. అందుకే విటమిన్‌‌‌‌‌‌‌‌ ఏకి మారురూపాలైన రెటినోల్‌, రెటినాల్‌, రెటినిల్‌లను కొందరు సూచిస్తారు. గర్భిణులు మాత్రం ఈ విటమిన్‌‌‌‌‌‌‌‌ ఏని డైరెక్ట్‌‌‌‌‌‌‌గా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే పుట్టే పిల్లలు లోపాలతో పుడతారు. వాటికి ప్రత్యామ్నాయమా అన్నట్టు యవ్వన రహస్యం మన ఇండియా మొక్కలోనే దాగి ఉందని సైంటిస్టులు చెప్పారు.

బాబ్చి అనే మొక్కలో ఉండే ‘బాకుషియోల్‌ ’ అనే రసాయనం చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా, వయసు మీద పడకుండా చూస్తుందట. ఇప్పటికే ఆయుర్వేదంలో దీన్ని బాగా వాడుతున్నారు. ఇప్పుడు అందులోని యాంటీ బాక్టీరియల్‌ , యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను సైంటిస్టులు పరిశోధనాత్మకంగా నిరూపించారు. 44 మంది వలంటీర్లపై ప్రయోగాలు చేశారు. కొందరిని బాకుషియోల్‌ 0.5 క్రీమ్‌ ను, మరికొందరిని రెటినోల్‌ 0.5 క్రీమ్‌ ను 12 వారాల పాటు వాడాల్సిందిగా సూచించారు. ఫలితాలను చర్మనిపుణులు అంచనా వేశారు. ఆ రెండూ వాడిన వాళ్లలో మంచి ఫలితాలే కనిపించినప్పటికీ, రెటినోల్ వాడిన వాళ్లలో చర్మం పగిలిందని గుర్తించారు. బాకుషియోల్‌ వాడినోళ్లలో సైడ్‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌లు తగ్గినట్టు కనుగొన్నారు. దీనిపై పెద్ద మొత్తంలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్‌‌‌‌‌‌‌‌ డెర్మటా లజిస్ట్‌‌‌‌‌‌‌‌ అంజలి అన్నారు. ఈ స్టడీ బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ డెర్మటాలజీలో ప్రచురితమైంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy