రకరకాల ఒత్తిళ్లతో అలసి……సొలసిన వాళ్లు ….సాయంత్రం కాసేపు … అలా…..యాక్వేరియం చూస్తూ ఉంటే….మనసుకు హ్యాపీగా ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. కొంతమందైతే….మరో అడుగు ముందుకేశారు. యాక్వేరియంను అద్రుష్టానికి ఐకాన్ భావించడం మొదలెట్టారు. దీంతో, కాస్తంత డబ్బున్న ప్రతి వాళ్లూ……ఇంట్లో యాక్వేరియం పెట్టుకోవడం మొదలెట్టారు.
యాక్వేరియాలు…..చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లు కూడా రోజూ….కొంత టైమ్…..యాక్వేరియం ఎదురుగా కూర్చోవడం అలవాటు చేసుకున్నారు. యాక్వేరియంలో చేప పిల్లలను చూస్తూ…..రిలాక్స్ అవుతున్నారు.
ఇక చిన్న పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్వేరియంలో చిన్న చిన్న చేప పిల్లలు…..అటూ ఇటూ ఈదులాడుతూ ఉంటే, వాటిని చూస్తూ ….భలేగా ఎంజాయ్ చేస్తున్నారు.
నాలుగు డబ్బులు పడేసి…యాక్వేరియం కొనుక్కోగానే సరిపోదు. ఆక్వేరియం ఉన్న వాళ్లు………లైటింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యాక్వేరియం తొట్టికి ఎనిమిది నుంచి పది గంటల లైటింగ్ సరిపోతుంది. అంతకంటే…..ఎక్కువ సేపు లైటింగ్ ఉంటే……ఆ వేడిని చేప పిల్లలు తట్టుకోలేవు…చచ్చిపోతాయి.
లైటింగ్ పెట్టడం వల్ల…..చేపల తొట్టి త్వరత్వరగా వేడెక్కుతుంది. ఇలా వాటర్ బాగా వేడెక్కితే…..అందులో ఉండే చేప పిల్లలు ఎక్కువ కాలం బతకవు. దీంతో, అప్పుడప్పుడు…..ఫిష్ టాంక్ లోని నీళ్లను మారుస్తుండాలి. చేప పిల్లల పై లైటింగ్ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
హెల్త్ కు కూడా యాక్వేరియం వాచ్ చేయడం ఎంతో మంచిదంటున్నారు డాక్టర్లు. డైలీ …కాసేపు యాక్వేరియంను చూస్తు ఉంటే…… బీపీ పెరగదని చాలామంది నమ్ముతున్నారు.
ప్రపంచంలోని అతి పెద్ద యాక్వేరియం సింగపూర్ లో ఉంది. దీన్ని….సౌత్ ఈస్ట్ ఆసియా యాక్వేరియం పేరుతో పిలుస్తారు. ఈ యాక్వేరియం లో 12 మిలియన్ గ్యాలన్ల నీటిని ఎప్పుడూ మెయిన్ టైన్ చేస్తారు. ఈ నీటిలో ఎనిమిది వందలకు పైగా రకరకాల సముద్ర జీవులు ఉంటాయి.
118 అడుగుల వెడల్పు, 27 అడుగుల ఎత్తులో ఉండే…. సౌత్ ఈస్ట్ ఆసియా యాక్వేరియం ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు….ప్రత్యేకంగా సింగపూర్ కు టూర్ పెట్టుకుంటారు. దీన్ని చూస్తుంటే……..సముద్రం లోపలకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.
అట్లాంటాలోని జార్జియా ఆక్వేరియం. వాల్డ్ లోనే రెండో అతి పెద్దది. ఈ యాక్వేరియం వాటర్ కెపాసిటీ పది మిలియన్ గ్యాలన్లు.
బయట యాక్వేరియం ను చూడగానే…..చాలా మంది వెంటనే ఇన్ ఫ్లూయన్స్ అవుతారు. హడావిడిగా ఓ యాక్వేరియం కొనుక్కుని వచ్చి…..ఇంట్లో ఓ మూల పడేస్తారు. అయితే, యాక్వేరియంలోని చేప పిల్లల ఆలనా పాలనా పట్టించుకోరు. అయితే, ఇది కరెక్ట్ కాదు. చేప పిల్లల శుభ్రత, వాటి ఆహారం, గాలి, వెలుతురు….ఇలాంటి అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే…మంచి యాక్వేరియం ను ఎవరైనా మెయిన్ టైన్ చేయగలరు.