యాక్సిడెంట్ కాదు… కావాలనే ఢీ కొట్టాడు

36DCBDEB00000578-0-image-a-1_1470297855685యాక్సిడెంట్ వేరు.. కావాలని కారుతో ఢీ కొడితే అది వేరు. అదిగో అలాంటి ఇన్సిడెంటే అమెరికాలో జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఆ దెబ్బకు 15 అడుగుల ఎత్తుకు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయినా వదిలేశాడా అంటే అదీ లేదు. మళ్లీ వచ్చి ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి హాస్పిటల్ లో చేరాడు. ఈ దుర్ఘటన వర్జీనియా సిటీ నార్ ఫోక్ ప్రాంతంలో జరిగింది. గత నెల 23న ఈ ఘటన జరగగా.. సీసీటీవీ ఫుటేజ్ తాజాగా విడుదల చేశారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ అయితే చేశారు కానీ.. బెయిల్ ను మాత్రం ఆపలేకపోయారు. దీనిపై గాయపడ్డ వ్యక్తి కుటుంబీకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy