యాదాద్రి.. ఒక్కో అడుగు ముందుకు

Yadadri-Temple-Master-plan-Photos1యాదాద్రి అభివృద్ధికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నరసింహస్వామి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మార్చేందుకు సర్కార్ పనులను వేగవంతం చేసింది. జిల్లా అధికార యంత్రాంగంతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనులపై ఆరా తీస్తోంది. ఇప్పటికే డెలప్ మెంట్ పనులకు కావాల్సిన భూసేకరణను జిల్లా అధికారులు దాదాపు పూర్తి చేశారు. టెంపుల్ డెవలప్ మెంట్ కోసం జరుగుతున్న పనులపై ఆలయ అర్చకులతో పాటు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి పరిసరాల్లో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్లాన్ రెడీ చేస్తున్నారు.  పార్కులు, రోడ్డు పనులు ఇప్పటికే స్టార్ట్ చేశారు. గుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో జలాశయాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులు ఇప్పటికే సర్వేలు కూడా చేశారు. గుట్ట చుట్టుపక్కల చెరువులను మినీ ట్యాంక్ బండ్ లుగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. బోటింగ్ తో పాటు చుట్టూ గ్రీనరీ, పూల చెట్లు ఏర్పాటు చేయనున్నారు. చెరువు మధ్యలో యాదాద్రి, తెలంగాణ  చరిత్రకు సంబంధించిన భారీ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. రాత్రి టైమ్ లో  లేజర్ లైటింగ్, విద్యుత్ దీపాలతో పాటు స్పెషల్ లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నారు. అయితే టెంపుల్ డెవలప్ మెంట్ కు ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఆలయ అభివృద్ధి కోసం చేపట్టే భూసేకరణలో రైతులకు నష్టం జరగకుండాచూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తయితే తొందర్లోనే యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంగా మారనుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy