యాదాద్రి పవర్ ప్లాంట్ కు లైన్ క్లియర్

Yadadri_Plantయాదాద్రి పవర్ ప్లాంట్ కు లైన్ క్లియర్ అయింది. ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు లభించాయి. 4వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి పవర్ ప్లాంటును నిర్మిస్తున్నారు. 27వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. REC 21వేల కోట్లు సాయం చేస్తోంది. ఇప్పటికే మిగిలిన అన్ని రకాల అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు కూడ రావడంతో… ప్లాంట్ నిర్మించేందుకు అడ్డంకులు తొలగాయి. పర్యావరణ అనుమతులు రావడంతో సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు యాదాద్రి వపర్ ప్లాంటు ముఖ్యమైందన్నారు. అనుమతులు వచ్చేటందుకు కృషి చేసిన జెన్ కో చైర్మన్ ప్రభాకర్ రావును ఫోన్ చేసి అభినందించారు కేసీఆర్. వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు.  సదరన్ రీజినల్ పవర్ కమిటీ (SRPC) చైర్మన్ గ ట్రాన్స్ కో &  జెన్ కో  చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు నియమితులయ్యారు. SRPC  చైర్మన్ గా ప్రభాకర్ రావును నియమిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ  ఆర్డర్స్ ఇచ్చింది.

సదరన్ రీజినల్ పవర్ కమిటీల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి.  దక్షిణ భారత రాష్ట్రాల మధ్య జరిగే విద్యుత్ పంపిణీ, పవర్ గ్రిడ్ ఆపరేషన్, విద్యుత్ వినియోగం, అంతర్రాష్ట్ర విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రభుత్వంతో దక్షిణాది రాష్ట్రాల తరుపున సంప్రదింపులు, రాష్ట్రాల మధ్య వివాదాల్లో SRPC పని చేస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy