యాహూ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ “ఆవు”

cow‘యాహూ’ కంపెనీ ఈ ఏడాది పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఆవును అనౌన్స్ చేసింది. ఇండియాలో ఈ ఏడాది చేపట్టిన సమీక్షలో ఆవు టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచిందని ‘యాహూ’ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆవుని పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. బీఫ్‌ అమ్మకాలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో విపరీతమైన చర్చ జరిగింది. తర్వాత జరిగిన దాద్రి సంఘటన, కవులు, రచయితలు అవార్డులు వెనక్కి ఇచ్చేయడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ ఇన్సిడెంట్లన్నీ ‘ఆవు’ చుట్టూనే తిరిగాయి. దీంతో ఎక్కువ మంది ప్రజలు దీని గురించే చర్చించారని.. అందుకే ఆవుకి ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు యాహూ సంస్థ ప్రకటించింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy